ప్రేమి విశ్వనాధ్ అంటే కొంత మందికే తెలుస్తుంది అదే వంటలక్క అంటే మాత్రం ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అలాంటి వంటలక్కను కార్తీక దీపం 2 వచ్చేవరకు చూడలేము అని చాలామంది బాధపడుతున్నారు. మరి సీరియల్ ఐపోయింది కదా ప్రస్తుతం వంటలక్క ఎం చేస్తోందో అనుకుంటున్నారు ఆమె ఫాన్స్. ఐతే వంటలక్క కొచ్చిలో ఏర్పాటు చేసుకున్న తన సొంత ప్రొడక్షన్ హౌస్ వి-మీడియా పనులు చూసుకుంటోంది. కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన తన ప్రొడక్షన్ హౌస్ ఓపెనింగ్ సెరిమనీకి మలయాళం ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.
ఇక ఇప్పుడు దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోంది వంటలక్క. రీసెంట్ గా వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ కి "భారతీయ చలనచిత్ర నిర్మాత, నటుడు ఐన సురేష్ కుమార్ విజిట్ చేశారు. రేవతి కళామందిర్ బ్యానర్‌పై ఆయన మూవీస్ తీస్తూ ఉంటారు..అలాంటి గొప్ప వ్యక్తి మా స్టూడియోని సందర్శించినందుకు ధన్యవాదాలు. రాబోయే ప్రాజెక్ట్స్ లో గ్రేట్ సక్సెస్ ని అందుకోవాలని కోరుకుంటున్నాం" అంటూ ఆయనతో ఫోటో దిగింది. ఆ ఫోటోని ఈ కాప్షన్ కి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. ఇక నెటిజన్స్ వంటలక్కను ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉందని, ప్రొడక్షన్ హౌస్ ద్వారా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అందరూ విషెస్ చెప్తున్నారు.